దుర్గామాత నిమజ్జన వేడుకలు

22-10-2026 | 11:16pm

పటాన్ చెరు: ముత్తంగి డివిజన్‌(Muthangi division) సిఎంసి పరిధిలోని వెలిమెల గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల(Sharannavaratri Utsavalu) సందర్భంగా నిర్వహించిన అమ్మవారి నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తంగి డివిజన్‌ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శాపురం నర్సింహా రెడ్డి పాల్గొని శ్రీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు