బస్సు–బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
తాడ్వాయి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ సమీపంలోని దేవాయిపల్లి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన గనిషం గోపాల్ తన బైక్పై పని నిమిత్తం చిట్యాల నుంచి బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు దేవాయిపల్లి నుంచి తాడ్వాయికి వెళ్తోంది. ఈ క్రమంలో ఎదురెదురుగా వచ్చిన బస్సు, బైక్ (Bus-Bike Collision) ఢీకొన్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో బైక్ ముందు భాగం నుజ్జునుజ్జయింది.
దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు (Severe Injuries). ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆయనను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు (Emergency Medical Treatment).