చిల్పూర్ గుట్ట ఆలయంలో స్వామివారి కల్యాణం
చిల్పూర్,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon district) చిల్పూర్ గుట్ట(Chilpur gutta)పై కొలువైన శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానం(Sri Bugulu Venkateswara Swamy Temple)లో శనివారం స్వామివారి కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణంలో వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు - కిరణ్మయి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.