ఆదర్శ మహిళా సంస్థ

24-10-2026 | 05:05am

తన ఎనిమిదవ తరగతిలో అమ్మ చనిపోయినా, అమ్మ ప్రేమను గుండెలో పదిలంగా భద్రపరుచుకొని, ‘జీననీ శతకం’ రచించిన రావూరి వనజ(Rawoori Vanaja) పాలమూరు జిల్లా వాస్తవ్యురాలు. ప్రతి సంవత్సరం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళా మణులకు ‘మహిళా శక్తి పురస్కారాలు’ అందిస్తున్న వనజగారు మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచారు. ఏడు సంవత్సరాల క్రితం ‘తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ’ను స్థాపించి, దానికి అధ్యక్షురాలిగా ఉండి చేస్తున్న సేవ ప్రశంసింపదగింది.

ప్రతి సంవత్సరం ప్ర ముఖ సాహితీ వేత్తలను ఉగాది పురస్కారాలతో గౌరవిస్తూ, అదేవిధంగా ప్రజాకవి కాళోజి నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహిస్తూ విశిష్ట సాహితీమూర్తులకు పురస్కారాలిస్తూ తనకుగల సాహితీ ప్రియత్నాన్ని చాటుకుంటున్న వనజగారు అభి నందనీయురాలు.

‘టీచర్స్ డే’ సందర్భంగా జిల్లా స్థాయి లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలచే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులకు సుమారు ముప్పు మందికి ప్రతి సంవత్స రం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలిస్తూ తమ వదాన్యతను నిరూపించుకున్నారు వనజగారు. తమ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగునా ఏదో ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లాకే కాక, తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఒక మహి ళా సాహితీ వేత్తగా మంచి గుర్తింపు పొందినారు వనజగారు.

సత్యసాయి బాబా శతజయంతి (2025) ఉత్సవాల సందర్భంగా వనజగారు ఉభయ రాష్ట్రాల నుంచి సు మారు 2 వందలమంది కవులచే సాయిబాబాపై కవితలు రాయించి ఒక సంకల నం తమ సంస్థ పక్షాన ప్రచురించారు. ఆ సంకలనం ఆవిష్కరణ జరిగేటప్పుడు పాలమూరుకు నేను ముఖ్యఅతిథిగా వెళ్లాను. ఉభయ రా ష్ట్రాల నుంచి కవులు వచ్చి ఆ కార్యక్రమం లో పాల్గొనడం నాకానందాన్ని కల్గించింది.

మరొక్క విశేషం ఏమంటే, వనజ అధ్యక్షురాలిగా, శాంతారెడ్డి కార్యదర్శిగా సంస్థ పక్షాన ఇటీవల రెండు రోజులు పాకాల యశోదారెడ్డి 97వ జయంతి సందర్భంగా, ఆ విద్వన్మణి రచనలపై రాష్ట్రస్థాయి సద స్సు జరిగింది. తెలంగాణ సా హిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ఆ సదస్సులో సమర్పింపబడిన పరిశోధన పత్రాలు పుస్తక రూపంలో రావడం విశేషం!

నిరంతరం సాహితీ కార్యక్రమాలతో బిజీగా ఉండే వనజగారు ఏ గొప్ప ప్రభుత్వోద్యోగంలో ఉన్నవారు కాదు. మొదటి నుంచి వారు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగానే ఉన్నారు. పాలమూరులోని ఒక్క ‘లిటిల్ స్కాలర్స్ పాఠశాల’లోనే 23 సంవత్సరాలు తెలుగు పాఠాలు బోధించారు. ఎంఏ, బీఇడీ డిగ్రీ లు ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వోద్యోగం వరించలేదు. ఐనప్పటికీ తన విద్యాతృష్ణను, సాహిత్య కార్య క్రమాల ద్వారా తీర్చుకున్నారు. ప్రముఖులను సత్కరించడం ద్వారా నిరూపించు కున్నారు. 

నాటి పాలమూరు జిల్లాలోని ‘చంద్రకల్’లో జన్మించిన వనజగారు సొంతగ్రా మంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని, ఆరవ తరగతి చదవడానికి ఆడపిల్ల ఐనప్పటికీ రోజూ నాల్గుమైళ్లు నడిచి ముద్దు నూరు గ్రామానికి వెళ్ళేది. వనజ తమ తల్లిదండ్రులకు కల్గిన 8 మంది సం తానంలో నాల్గవవారు. ఆమె నాన్న గారు మొకురాల రామేశ్వర శర్మ పౌరోహిత్యం చేసి పిల్లలందరినీ చదివించాడు. వనజ పాలెం లో బీఎస్సీ చేస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి టైపిస్టు ఉద్యోగం చేసింది.

ప్రైవేట్‌గా పిల్లలకు చదువు చెబుతూ తం డ్రిగారికి చేదోడువాదోడుగా నిలిచింది. కుటుంబ ధర్మాన్ని పూర్తిగా పాటించిన ఉత్తమ మహిళ వనజ. ఎంఏ పూర్తికాగానే నాగర్ కర్నూల్‌లో మూడు సంవత్సరాల పాటు జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. అప్పుడే కవి కపిలవాయి లింగమూర్తిగారి ప్రోత్సాహంతో ఆమె పద్యాలు రాయడం నేర్చుకున్నది. అత్తవారింటిలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఆమెకు మామ రావూరి సూర్య నారాయణగారి ప్రోత్సాహం లభించింది. రావూరి సూర్యనారాయణరావు గారు కాంతం కథల రచయిత ముని మాణిక్యం నరసింహారావుగారికి స్వయాన మేనల్లుడు కావ డం విశేషం.

సాహిత్య కార్యక్రమాల్లో వనజకు ఆమె భర్త కృష్ణకుమార్ గారి సహా యం సంపూర్ణంగా లభించింది. వనజగారికి ప్రభుత్వోద్యోగం లభించక పోవడం ప్రైవేటు ఉద్యోగాల్లోనే స్థిరపడడం వల్ల బదిలీలు లేకపోవడం వల్ల ఉన్న చోటనే సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సదవకాశం లభించింది. సాంఘిక సంక్షేమ గురు కుల మహిళా కళాశాలలోను తెలుగు లెక్చరర్‌గా మూడేళ్లున్నప్పటికీ, ఆమెకు స్థిరత్వా న్ని ఇవ్వలేక పోయింది ఆ ఉద్యోగం. 

వనజగారు ప్రభుత్వ ఉద్యోగం చేయనందుకెన్నడూ బాధ పడలేదు. ఆమెకు సాహిత్య కార్యక్రమాలంటే విందు భోజనంతో సమానం. పాలమూరు జిల్లా కవు లనే కాక, ఇతర జిల్లాలలోని సాహితీవేత్తలను పిలిచి సభలు నిర్వహించిన గౌరవం ఆమెకే దక్కింది. వనజలో ఉన్న సుగుణం ఏమంటే ఆమె తెలంగాణలో గాని, చివరికి కాశిలోగాని ఎక్కడ ఏ అవధానం జరిగినా కవి సమ్మేళనం జరిగినా ఆహ్వానం అందుకొని వెళ్లి వస్తుంది. పారితోషికం ఎంత ఇస్తారని అడగడం తెలియదు.

ఈ మధ్యకాలంలో ప్రమిలా శక్తి పీఠం ఆమె సాహిత్య సేవలను గుర్తించి పదివేల రూపాయల నగదుతోపాటు ‘విశిష్ట సాహి తీ పురస్కారం’ అందించి గౌర వించింది. ప్రమిలా శక్తి పీఠానికి ఆమెను కార్యదర్శిగా నియమించింది. 

వనజ గారందుకున్న పురస్కారాల్లో ‘హృదయభారతి స్వర్ణపుష్పం’ మాస పత్రిక అందించిన సాహితీ పురస్కారం, ‘గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ’ వారి ‘మహాత్మా చరఖా అవార్డు’, ‘సామాజిక సమరసత్తా వేదిక పాలమూరు’ వారి ‘అంబేద్కర్ పురస్కారం’, లిటిల్ స్కాలర్స్ పాఠశాల వారి ‘జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య పురస్కారం’, కురుమూర్తి దేవస్థానం వారి ‘ఉగాది పురస్కారం’, ‘కలం స్నేహం సేవా సంస్థ’ వారి  ఉత్తమ మహిళా పురస్కారం’, ‘భక్తి సాధన సంస్థ వారి’ ‘మహిళా సేవ భక్తి పురస్కారం’, భారత జాగృతి అధ్యక్షురాలందించిన ఆత్మీయ పురస్కారం, తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో భా గంగా లభించిన సాహితీ పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ వారి ‘ఉత్తమ మహిళా సాహిత్య సంస్థ విశిష్ట సాహితీ పురస్కారం’ మొదలైనవి ముఖ్యంగా పేర్కొనదగినవి.

పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా లో సాహిత్య చైతన్యాన్ని నిరంతరం ప్రసరింపజేస్తూ, మహిళాభ్యుదయానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న వనజగా రికి ఎన్ని పురస్కారాలు లభించినా తక్కువే. ఒక సంస్థకు అధ్యక్షురాలిగా ఉండి, నిరంతరం సాహితీ సేవలో ఉన్న రావూరి వనజగారిని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం వారు కనీసం ‘కీర్తి పురస్కారం’ ఇచ్చినా, ఒక విశ్వవిద్యాలయ ఆచార్యునిగా నేను సంతోషిస్తాను.

వ్యాసకర్త సెల్: 9885654381

ఆచార్య మసన చెన్నప్ప

మరిన్ని వార్తలు