5 September, 2026 | 9:40 AM

సర్కార్‌కు అసెంబ్లీ సవాల్

05-09-2026 | 05:30am

డా.ఎర్రోజు శ్రీనివాస్ :

వరుస నిరసనలు(Protests), పరిపాలనాపరమైన సవాళ్లు, పార్టీలో అసంతృప్తులు(Disgruntled), తీవ్రమైన న్యాయపరమైన చిక్కుల నడుమ తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Legislative Assembly Sessions) ప్రారంభం కానుండటం ప్రభుత్వానికి రాజకీయంగా, వ్యూహాత్మకం గా పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు అసెంబ్లీలో ప్రతిపక్షాల(opposition parties) పదునైన దాడిని తట్టుకోవడం, మరోవైపు వీధుల్లో వ్యక్తమవుతున్న ప్రజా అభీష్టానికి ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపాల్సిన గురుతర బాధ్యత పాలకవర్గంపై ఉంది.

శాసనసభ వేదిక(Legislative Assembly platform) కేవలం వాదోపవాదాలకు, రాజకీయ విమర్శల ప్రత్యారోపణలకు పరిమితం కాకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వేదికగా మారా ల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన పలు హామీలను నెరవేర్చడంలో జరుగుతున్న జాప్యం తో పాటు, గతంలో నిరాటంకంగా అమలైన సంక్షేమ పథకాలకు(Welfare schemes) అడ్డంకులు ఎదురవడం, సరికొత్తగా తీసుకువచ్చిన పాలనాపరమైన నిబంధ నలు ప్రజల ప్రాథమిక హక్కులను, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయడం తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. సభ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రకటనలు చేయా ల్సిన అవసరం ఉంది.

22 సెక్షన్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం విలవిలలాడుతున్నది. రాష్ర్టంలో రిజిస్ట్రేషన్ల చట్టం, 1908లోని సెక్షన్ 22 (నిషిద్ధ ఆస్తుల జాబితా) కింద దాదాపు 90-98 లక్షల ఎకరాల భూములను నిషేధించడం ఒక బృహత్తర రాజకీయ, పరి పాలనా సంక్షోభానికి దారితీసింది. ప్రభుత్వ, వ క్ఫ్, దేవాదాయ భూములను రక్షించాలనే మం చి ఉద్దేశంతో ప్రతిపాదించినట్టు చెప్పినప్పటికీ, ఈ ప్రక్రియ అనేక అనుమానాలకు తెరలేపింది.

డిజిటల్ అప్‌డేట్ లోపాలు, తీవ్ర పరిపాలనా లోపాల వల్ల వేలాది ఎకరాల నిరభ్యంతరకరమై న వ్యక్తిగత పట్టా భూములు, ఆమోదిత లేఅవుట్ల ప్లాట్లు కూడా పొరపాటున నిషిద్ధ వర్గంలో చేరిపోయాయి. దీనివల్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై పూర్తి స్థాయి నిషేధం విధించబడింది. బ్యాంకులు రు ణాలను తిరస్కరిస్తుండటంతో పౌరులు తమ ఆస్తి హక్కులను కోల్పోయి తీవ్ర ఆర్థిక స్తంభనకు గురవుతున్నారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోని కూకట్‌పల్లి, మియాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు భూలావాదేవీలు నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో, రాష్ట్ర ఉపాధి రంగం లో  సుమారు 15% వరకు విస్తరించి ప్రత్యక్షం గా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ, రి యల్ ఎస్టేట్ రంగం విలవిలలాడుతోంది. ప్రత్యక్షంగా సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, సైట్ సూప ర్‌వైజర్లు, తాపీ మేస్త్రీలు, కూలీలు, మార్బుల్, శానిటరీ, ఎలక్ట్రికల్ పనులపై ఆధారపడిన రోజువారీ వేతన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

పరోక్షంగా స్టీల్, సిమెంట్, పెయింట్స్, ట్రాన్స్‌పోర్ట్, క్రేన్ లీజింగ్, ప్రాపర్టీ బ్రోకరేజ్ రంగాలు స్తంభించిపోయాయి. హెచ్‌ఎండీఏ, ఫ్యూచర్ సి టీ, ఓఆర్‌ఆర్, ట్రిపులార్ ప్రాంతాల్లోని పట్టణ అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది వలస కార్మికులు తమ ఆదాయ వనరులను కో ల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిలిపివేతతో సంక్షేమానికి గ్రహణం పట్టింది. పేద కుటుంబా ల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో పారదర్శకత, అర్హతల నిబంధనలపై దాఖ లైన పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీవ్ర అ భ్యంతరాలు వ్యక్తపరిచింది.

అయితే, ఇటీవల డివిజన్ బెంచ్ తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ, న్యాయపరమైన చిక్కులను అధిగ మించడానికి ఒక పటిష్టమైన చట్టాన్ని రూపొందించి, కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు సవరణ లు చేస్తూ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి.

ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో సరైన విధివిధానాలు అమలు చేయకపోవడంతో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.  రూ.10, 000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఉన్నత విద్యార్థులు అ నేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ట్యూషన్ ఫీజు నిధులు సమయానికి విడుదల కాకపోవడంతో ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, పారామెడికల్ కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

జీ తాలు చెల్లించలేక యాజమాన్యాలు, అధ్యాపకులు ధర్నాలు, బంద్ పిలుపులకు సిద్ధమవుతు న్నారు. మరోవైపు, కోర్సులు పూర్తయినా ఫీజు బకాయిల నెపంతో యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపుతుండటంతో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు, క్యాంపస్ నియామకాల ద్వారా లభించిన ఉద్యోగాలలో చేరడానికి అనర్హులుగా మారుతున్నారు. ప్రభుత్వం నిర్దిష్ట కాలమితితో ఈ నిధుల విడుదలకు అసెంబ్లీలో హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ విలీన వివాదంతో పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్య మ బాటపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్ర తిపాదించిన యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పరిధిలోకి సాంప్రదాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాలలను విలీనం చేయడం లేదా వాటి పరిధిని సమీక్షించడం తీవ్ర వివాదాస్పదమైంది.

మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు ప్రాధాన్యత కోల్పోయి స్వల్పకాలిక కోర్సులుగా మారతాయేమోనని వి ద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నా రు. అధ్యాపకుల సర్వీసు నిబంధనలు, భవిష్యత్ నియామకాలు, విద్యార్థుల ఉన్నత చదువుల అవకాశాలపై ప్రభుత్వం సాంకేతిక విద్య ఉనికి దెబ్బతినకుండా స్పష్టతనివ్వాల్సి ఉంది.

ఇవాళ తెలంగాణలో ప్రతిరోజు నిరుద్యోగ నిరసన జ్వాలలు ఏదో ఒక మూల రగులుతూనే ఉన్నాయి. జీవో 46 లోపాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంపై నిరుద్యోగులు ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేస్తున్నారు. డీజీపీ ప్రకటించిన పోలీసు ఉద్యోగాల ఖాళీలకు, నోటిఫికేష న్‌కు పొంతన లేకపోవడంతో నిరుద్యోగులు ఉ ద్యమ బాటపట్టారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై తక్షణ సమాధానం చెప్పవలసి ఉన్నది.

ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీ, డీఏల దీర్ఘకాలిక పెండింగ్, ఈహెచ్‌ఎస్ వైఫల్యంతో ఉద్యోగ వర్గా లు ఆందోళన పథంలో నడుస్తున్నాయి. వేతన సవరణ నివేదిక అమలులో జాప్యం, పెండింగ్‌లో ఉన్న 6 విడతల కరవు భత్యం విడుదలపై ఉద్యోగ సంఘాలు దసరా నాటికి స్పష్టత రాకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నాయి. క్యాష్‌లెస్ వైద్యం, పీఆర్సీ, డీఏల విడుదలపై సభలో ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితి హామీ ఇవ్వాల్సి ఉంది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అధికారంలోకి వచ్చాక నెరవేర్చకుండా, ప్రభుత్వం ప్రతిప క్షాల ప్రశ్నలను కేవలం రాజకీయ విమర్శలుగా కొట్టివేస్తే ప్రజలు హర్షించరు. అదేవిధంగా కేవలం ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడానికే శాసనసభ సమయాన్ని కేటాయిస్తే, అది ప్రజాస్వామ్యస్ఫూర్తికే చేటు తెస్తుంది. విమర్శలను స్వీకరించే సహనం, సమస్యలను పరిష్కరించే సంక ల్పం ఉన్నప్పుడే ప్ర జాప్రతినిధుల సభ సఫలీకృతమవుతుంది.

ప్రజా ప్రభుత్వ మనే టాగ్ లైన్ మా త్రమే సమస్యలను పరిష్కరించలేదు. నినాదాలు వాస్తవ రూపంలోకి వచ్చి నిధులుగా మారినప్పుడే ప్రజలకు ఉపశమనం చేకూరుతుంది. రాజకీయాధిపత్య పోరాటాలకు స్వస్తి చెప్పి, పౌరుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చేలా విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఈ శాసనసభ సమావేశాలు అర్థవంతమ వుతాయి. ప్రభుత్వానికి అసలైన రాజకీయ, పరిపాలనా ఉపశమనం లభిస్తుంది.

 వ్యాసకర్త: తెలంగాణ అధ్యయన 

సమాలోచన కేంద్రం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు