5 September, 2026 | 5:59 AM

డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా

05-09-2026 | 05:15am
  1. డ్రైవర్ మృతి, 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు 
  2. కామారెడ్డి జిల్లా జుక్కల్ పరిధిలో ప్రమాదం
  3. మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

కామారెడ్డి/జుక్కల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్(Kamareddy district) మండల పరిధిలో బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. 13 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ డిపో(Hyderabad depot)కు చెందిన ఆర్టీసీ బస్సు(RTC bus) హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జుక్కల్(Jukkal) సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.

డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బి చ్కుంద, మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్లో వివరాలను తెలియజేశారు.

ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్  మృతి కలచివేసిందన్నారు, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

మరిన్ని వార్తలు