శ్రమశక్తులకు పట్టం కట్టాలి

24-10-2026 | 05:10am

భారత్(INDIA)  చైనా(China)ల మధ్య కొనసాగుతున్న వేల కోట్ల రూపా యల ఎగుమతి, దిగుమతుల లెక్కలను పరిశీలిస్తే.. అక్కడ కేవలం వాణిజ్య లోటు కు సంబంధించిన అంకెలు మాత్రమే కనిపించడం లేదు. దశాబ్దాల స్వతంత్ర భార తంలో వెనుకబడిన తరగతుల (బీసీల) దయనీయ స్థితికి అద్దం పట్టే చేదు నిజాలు ఆవిష్కతమవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇన్నాళ్లూ దేశాన్ని పాలించిన ఆధిపత్య కులాల స్వార్థ పూరిత విధానాలు, సంకుచిత రాజకీయా ల వల్ల బీసీ సామాజిక వర్గాలు నేడు ఏ విధంగా దయనీయ స్థితికి నెట్టబడ్డారో ఈ అంకెలు కళ్లకు కడుతున్నాయి.

ఇప్పటివరకు రాష్ట్రాన్ని, దేశాన్ని ఆధిపత్య కుల పాల కులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలను స్వయంశక్తి గల సృష్టికర్తలుగా కాకుండా, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే యాచకులుగా మార్చేశారు. ఈ దుస్థితి మారాలంటే మెజార్టీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బీసీ సామాజిక వర్గా లు అధికారంలోకి రావాలి. అప్పుడే ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుంది. వారి ఆత్మగౌరవం నిలబడుతుంది.ఏటా చైనా నుంచి భారతదేశానికి రూ. 8.5 లక్ష ల కోట్ల నుంచి రూ. 9.5 లక్షల కోట్ల విలువైన సరుకులు దిగుమతి అవుతున్నాయి. కానీ, ఇందులో శోచనీయమైన విషయం ఏమిటంటే-, ఈ దిగుమతుల్లో కేవలం హైటెక్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, పారిశ్రామిక యంత్రాలు మాత్రమే లేవు, రోజు వారీ ఇళ్లలో వాడే అతి సాధారణ వస్తువులు కూడా ఉన్నాయి. 

చిన్న వస్తువులకూ చైనాపైనే.. 

రాకెట్లు పంపి అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న భార త్.. సామాన్య పౌరుడు తన ఇంటి పరిసరాల్లో లేదా కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేసుకోగల వస్తువుల కోసం చైనాపై ఆధారపడే దయనీయ స్థితి నెలకొంది. కేవలం కొన్ని చిన్నపాటి వస్తువుల కోసం మనం ఏటా చైనాకు చెల్లిస్తున్న వ్యయం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

చీపుళ్లు రూ. 800 కోట్లు, అగరబత్తులు  పూజా సామగ్రి రూ. 300 కోట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, పాత్రలు రూ.200 కోట్లు, టూత్‌పిక్స్ రూ.125 కోట్లు, పార్టీ జెండా లు, పిన్లు రూ. 60 కోట్లు. రోడ్డు పక్కన విక్రయించే చిన్నపాటి బొమ్మల నుంచి హోటళ్లలో వాడే టూత్‌పిక్స్ వరకు చైనా నుంచే తెచ్చుకోవాల్సిన దుస్థితికి మన పారిశ్రామిక విధానాలు దిగజారాయి. చైనా మనకు ఎగుమతి చేసేది కేవలం వ స్తువులనే కాదు.. ఆ దేశంలోని కోట్ల మం ది శ్రామికుల కష్టాన్ని, నైపుణ్యాన్ని, పారిశ్రామిక శక్తిని. మనం మాత్రం ముడి ఇనుము వంటి సహజ వనరులను చౌకగా అమ్మి, తిరిగి తుది ఉత్పత్తులను వేల రెట్లు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తు న్నాం. ఈ అసమతుల్యత పాలకుల దార్శనిక లోపానికి స్పష్టమైన నిదర్శనం.

చైనా నుంచి గుజరాత్ మీదుగా.. 

చైనాలో ‘జిజియాంగ్’ లేదా ‘గ్వాంగ్‌డాంగ్’ వంటి ప్రధాన పారిశ్రామిక ప్రావి న్సులు ఉన్నాయి. అక్కడ భారీ ఎత్తున వస్తువులు తయారవుతాయి. వాటి ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ.చైనా నుంచి దేశానికి వచ్చే ఎలక్ట్రానిక్స్, బట్టలు, ప్లాస్టిక్ వస్తువు లు, గృహోపకరణాలు సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌లోని ముద్రా పోర్ట్, ఇతర ఓడరేవుల ద్వారానే భారీగా భారత్‌లోకి ప్రవేశిస్తాయి. గుజరాత్ లేదా ఇతర ప్రాం తాల వ్యాపారులు వీటిని టోకుగా అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, రవాణా ఖర్చులు కలుపుకుని దేశంలోని చిన్న వ్యాపారులకు, రిటైల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. స్థానిక తయారీదారులు (చిన్న కుటీర పరిశ్రమలు) ధరల పరంగా పోటీపడలేకపోవడం వల్ల చైనా వ్యాపార సరళి దేశవ్యాప్తంగా విస్తరించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ చౌక వస్తువుల వల్ల భారత్‌లోని చేతి వృత్తులవారు, కుటీర పరిశ్రమలు, చిన్న తరహా తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఎదగాల్సిన చేతులు యాచకులుగా? 

ఈ దుస్థితికి అసలు కారణం ఇప్పటివరకు దేశాన్ని ఏలిన పాలకుల స్వార్థ పూరిత రాజకీయాలే. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజలను స్వయంశక్తి గల సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. బదులుగా ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా మలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే తక్షణ లబ్ధి, చిన్నపాటి ఉచితాలు చూపిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని మరుగున పరుస్తున్నారు.

ప్రజలు ప్రశ్నించేతత్వాన్ని కోల్పోతే తమ కుర్చీలకు, ఆధిపత్యానికి ముప్పు ఉండదనే సంకుచిత మనస్తత్వంతో నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందిం చకుండా వాటిని వ్యాపార సరుకులుగా మార్చేశారు. పేదరికాన్ని శాశ్వతం చేసి, ఆకలిని రాజకీయ అస్త్రంగా మల్చడం వల్లే ఈరోజు మన యువత, ముఖ్యంగా బీసీ, శ్రామిక వర్గాలు సొంతంగా పరిశ్రమలు స్థాపించే స్థాయిని కోల్పోయి సాయం కోసం ఎదురుచూసే స్థితికి చేరాయి.

‘ఆత్మగౌరవం మన జన్మహక్కు’  

ఒక దేశం కేవలం ఆకాశహర్మ్యాలు నిర్మిస్తేనో, జీడీపీ  అంకెలు పెరిగితేనో అభివృద్ధి చెందినట్లు కాదు. ఆ దేశంలోని ప్రతి పౌరుడు తలెత్తుకొని, ఆత్మగౌరవంతో తన కాళ్లపై తాను నిలబడినప్పుడే నిజమైన స్వాతంత్య్రం ప్రాప్తిస్తుంది. పౌరుల ఆత్మగౌరవం, దేశ స్వయంమృద్ధి నిలబడాలంటే కేవలం వస్తువుల దిగుమతిని నిరసించడం సరిపోదు. విధానపరమైన విప్లవాత్మక మార్పులు రావాలి. ప్రతి పేద బిడ్డకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందాలి.

ఆ విద్య కేవలం బట్టీ పద్ధతిలో ఉద్యోగాల కోసం కాకుండా, సొంతంగా ఆలోచించే, పరిశ్రమలు స్థాపించే నైపుణ్యాలను నేర్పేలా ఉండాలి. అనారోగ్యం వస్తే ఆస్తు లు అమ్ముకోవాల్సిన దుస్థితి పోయి, ప్రభుత్వమే ప్రతి పౌరుడి ప్రాణానికి భరోసా ఇస్తూ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలి. అప్పుడే ఒక కుటుంబం ఆర్థికం గా కోలుకోగలదు. ప్రభుత్వం ఉచితాల సంస్కృతికి స్వస్తి చెప్పి, సంక్షేమ పథకాలతోపాటు యువతను వ్యాపారవేత్తలుగా, తయారీదారులుగా మార్చేందుకు సులభ రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, విపణి (మార్కెట్ సౌకర్యం) కల్పించాలి.

హక్కులు కావాలి

కేవలం దయాదాక్షిణ్యాలపై బతికే బాని స బతుకులు మనకొద్దు. ఇప్పటివరకు అధికారం చెలాయించిన బ్రాహ్మణ, రెడ్డి, వెలమ పాలకుల స్వార్థ విధానాలకు చరమగీతం పాడుతూ, మెజార్టీ వర్గాల ఆకాం క్షలను మోసుకొచ్చే బీసీ పాలకులు చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ప్రజలకు అస లైన మేలు జరుగుతుంది. ఇకనైనా ప్రజలు తాత్కాలిక ప్రయోజనాల మాయలో పడిపోకుండా, తమ ఓటు శక్తిని ప్రశ్నించే ఆయుధంగా మలుచుకోవాలి. మన దేశంలోనే తయారైన ఉత్పత్తులతో మన ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటేలా పాలన సాగాలి. విద్య-,వైద్యం,-ఉపాధి హక్కులుగా మారాలని డిమాండ్ చేసే రాజకీయ చైతన్యం ప్రతి బీసీ, శ్రామిక, వెనుకబడిన వర్గాల్లో రావాలి. అదే నిజమైన సామాజిక న్యాయానికి తొలి అడుగు!

ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ (9177566741)

డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్

మరిన్ని వార్తలు