5 September, 2026 | 9:40 AM

పద్యమే జీవి త మైన రాధ శ్రీ

05-09-2026 | 05:25am

ఆచార్య మసన చెన్నప్ప :

నేను ఏడు పదుల వయసున్న రచయితనైనప్పటికీ, నా మీద ఒక శతకం రాసిన డాక్టర్ రాధశ్రీ(Radhashree) నాకెప్పుడూ జ్ఞాపకం వస్తుంటారు. సిండికేట్ బ్యాంకెక్కడ?(Syndicate Bank?) మెండైన సాహితీమూర్తిమత్వం ఎక్క డ? వాణిజ్య శాస్త్రంలో పి.జి. చేసి, ఆ తర్వా త అదే శాస్త్రంలో పిహెచ్.డి. చేసిన రాధశ్రీ తెలుగును(Telugu) ప్రేమించే నా మిత్రకోటిలో అగ్రగణ్యుడు. 2008లోనే కాక 2018లో రెండుసార్లు పన్నెండు గంటల పద్యధారణ(Poetry Recitation) నిర్విరామంగా చేసి, జంట నగరాల సాహితీ ప్రియులను అలరించిన రాధశ్రీ అసాధారణ ప్రతిభాశాలి!

ఆచార్య తిరుమలకు(Acharya Tirumala) మంచి మిత్రుడుగా మెలిగిన రాధశ్రీ నాకూ మంచి మి త్రుడయ్యారు. నా మీద ఆయనకు గల ప్రేమకు గుర్తు ‘చెన్నప్ప శతకం’! నూరు పద్యాలతో సంతృప్తిపడక 200 పద్యాలతో ‘చెన్నప్ప ద్విశతి’ని రచించిన రాధశ్రీ స్నేహానికి ప్రాణం ఇచ్చే సాహితీ మిత్రుడు. రాధ శ్రీ ఇప్పటివరకు ముప్పది ఆరు గ్రంథాలు రచించారు. ఆయన రచనలను నూటికి పైగా పత్రికలు ప్రచురించాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, రా ధశ్రీ సుమారు ఏడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక పద్యాన్ని తెలుగుభారతికి అందిస్తున్నారు. రాధశ్రీ కేవలం తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసిన అక్షరపిపాసి కాదు, చరిత్ర తెలిసిన మేధావి కూడా. వారు రాజకీయ ప్రముఖులు కావ చ్చు, సాహితీవేత్తలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు వారి పుట్టిన తేదీలను తెలుసుకొని ఆరోజు వారి వ్యక్తిత్వం ప్రస్ఫుటమయ్యే విధంగా ఒక పద్యం రాసి వాట్సాప్‌లో పెట్టి వందలాది సాహితీ ప్రియులను మెప్పించిన కవి రాధశ్రీ.

రాధశ్రీ కేవలం కవి కాదు, మంచి వక్త. ఆయన ఏ సభలో పాల్గొన్నా, ‘పద్యంలో మాట్లాడే ప్రతిజ్ఞ నాది’ అంటూ ప్రసంగం మొదలుపెడతారు. అనర్గళంగా ఆశుకవితను అల్లగలిగిన రాధశ్రీకి నన్నయ్య నుంచి నారాయణరెడ్డి దాకా వారి కవిత్వాన్ని వినిపించి సభాసదులను ఆనందపరవశుల్ని చేయడం వెన్నతో పెట్టిన విద్య.

1971 నుంచి తెలుగు సాహిత్య జైత్రయాత్ర కొనసాగిస్తున్న రాధాశ్రీ సీతారామ కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యాత. ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తాల్లో పద్యధారణా ప్రదర్శనలు చేశారు. వెయ్యికి పైగా సభల్లో సన్మానాలు పొందిన రాధాశ్రీ జర్మనీ, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ దేశాలు పర్యటించి వచ్చారు. ఆకాశ వాణిలో ఆయన ఎన్నో ప్రసంగాలు చేశా రు. టీవీ మాధ్యమాల్లో తన కవిత్వాన్ని వినిపించారు. సుమారు 250కి పైగా గ్రంథా లకు పీఠికలు రచించారు. వ్యక్తిత్వ వికాస ప్రసంగాలంటే రాధాశ్రీకి చాలా మక్కువ. 1997లో రాధాశ్రీకి సాహితీ రజతోత్సవం జరిగింది. 2022లో సాహితీ స్వర్ణోత్సవం జరిగింది. ఆయన 300కు పైగా జూమ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాధశ్రీకి తెలుగంటే ప్రాణం. ఆయన వాణిజ్య శాస్త్రంలో విజయం సాధించి సిండికేట్ బ్యాంకులో మేనేజర్ స్థాయి వరకు వెళ్లారు. అయినా తెలుగు మీది ప్రేమతో ఆయన ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసినా తెలుగు సాహిత్యాన్ని ఒక ఉద్యమం గా చేపట్టారు. పట్నాలలోనే గాక పల్లెటూర్లకు వెళ్లి ప్రసంగించిన గౌరవం రాధశ్రీకే దక్కింది. ఎలాంటి భేషజాలు లేని మంచి మనిషి, నిలువెల్లా కవితాగంధాన్ని పూసుకున్న ఆధునిక వి. ఆయన సాహితీ కృషిని మెచ్చుకొని ఆయా సంస్థలిచ్చిన బిరుదులు ఇరవై దాకా ఉన్నవి.

కనిపిస్తే చాలు పద్యాన్ని వినిపించే రాధశ్రీకి నేను స్వయంగా ప్రమీలా శక్తి పీఠం ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో ‘పద్యమౌళి’ అనే బిరుదునిచ్చాను. కిరీటంలాగా పద్యాన్ని శిరస్సున ధరించిన రాధశ్రీ నిజంగా పద్యమౌళియే.

రాధశ్రీకి కంద పద్యాలంటే చాలా ఇష్టం. కందం రాసిన వాడే కవి అంటారు కదా! ‘కందం కవి సార్వభౌమ’ బిరుదాంకితుడాయన. ఇంకా ఆయన బిరుదుల్లో ‘పద్యభూషి’, ‘ప్రతిభాశ్రీ’, ‘కవివతంస’, ‘భారతీపుత్ర’, ‘నిరంతర కవి’ అనే బిరుద ములు సార్థకమైనవి.

రాధశ్రీ తన సాహితీ సేవకు గాను ఇరవైకి పైగా పురస్కారాలు సాధించారు. ప్రభుత్వ ఉగాది పురస్కారం, ప్రభుత్వ మాతృభాషా సేవాపురస్కారం, రాయప్రోలు స్మారక పురస్కారం, చిలుకూరు నారాయణరావు స్మారక పురస్కారం, విశ్వసాహితీ పురస్కారం, నోరి నరసింహశాస్త్రి స్మారక పురస్కారం, తెలుగుతేజం పురస్కారం, ఎక్స్‌రే జాతీయ పురస్కారం మొ దలైనవి ఆయన కీర్తికీరిటంలో ధగధగ మెరిసే అక్షర మాణిక్యాలు.

రాధశ్రీకి ప్రాచీన సాహిత్యంపై ఇంతిం త గౌరవం అని చెప్పలేం. ‘రామాయణ రచన’, ‘భగవద్గీతకు భాస్కర భాష్యం’ ఆయన ప్రాచీన సాహిత్యాభిమానాన్ని చాటుతున్నాయి.

రాధశ్రీ రచనలన్నీ పద్య పరిమళాలను వెదజల్లుతున్నవే. ‘కవితా కృష్ణవేణి’, ‘ఆర్య చాణక్య’, ‘వర్గల్ వాణీ శతకం’, ‘కాశీమాత శతకం’, ‘సినారె శతకం’, ‘తారామతి- ప్రేమావతి’ కావ్యం, ‘శశిమౌళి’ శతకం, కలకత్తా సౌరభాలు, నరసింహ శతకం మొద లైన రచనలు పరిమాణంలో చిన్నవైనప్పటికీ, అవి విజ్ఞానదాయకమై, సహృదయ పాఠకుల మనస్సులను లోగొన్నవని చెప్పవక తప్పదు.

తెలుగు నూతన సంవత్సరం మొదటిరోజున ఆ సంవత్సరం పేరున తప్పక రాధ శ్రీ ఒక పద్యాన్ని రాసి వందలాది మందికి వాట్సాప్‌లో పెట్టకుండా ఉండరు. నేను రాధశ్రీని ‘సామయిక కవి’ అని ప్రేమతో పిలుస్తుంటాను. ఔచిత్యం తెలిసిన రాధశ్రీ ఎన్నడూ తన ప్రసంగాలతో, పద్యాలతో విసిగించలేదు.

‘పద్యమె నా పరమాన్నము

పద్యమె నా పసిడి మేడ భాస్వంతంబౌ

పద్యమె నా పట్టువలువ

పద్యమె నా మానసంబు పరికింపంగన్’

అన్న పద్యం రాధాశ్రీ అంతకరణానికి ప్రతీక!

నేను 1980లో ‘మల్లి పదాలు’ రచించాను. రాధశ్రీ వాటిని ఎంతో మెచ్చుకు న్నారు. కొన్నింటిని కంఠస్థం కూడా చేశా రు. నా మల్లిపదాలపై తన అభిప్రాయాన్ని ‘చెన్నప్ప శతకం’లో ఎంతో చక్కగా తెలియజేశారు.

‘మల్లీశ్వరిలో దేవుల

పల్లినినే చూసినాడ ప్రతిభదలిర్పన్

మల్లిపదంబుల కొలుకుల

పల్లీశుని మనసునేనుపట్టితి చెన్నా’

అని రాసిన పద్యం ఎన్నటికీ మరిచిపోను నేను.

నా సాహిత్య గురువు గుండేరావు హర్కారే. వారిపై రాధశ్రీ రాసిన పద్యం చెవులూరిస్తుంది.

‘మండే సూర్యుని సైతము

పాండిత్య ప్రభలతోడ భయపడజేసెన్

గుండేరావ్ పండితుడత

డుండును నీ గుండెలోన ఓ చెన్నప్పా’

అని రాసినప్పుడు నా జన్మధన్యమైంద న్న భావన కలిగింది. చెన్నప్ప శతకానికి పీఠిక రాస్తూ సినారె పలికిన ‘డాక్టర్ మసన చెన్నప్ప సత్కవి. డాక్టర్ రాధశ్రీ ఆశుధారా విలసత్కవి’ అన్న మాటలు మమ్మెంతగా అలరించాయో చెప్పలేను.

 వ్యాసకర్త సెల్: 9885654381

మరిన్ని వార్తలు