ఈనెల 11 వ తేదీ నుండి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

09-10-2026 | 12:45am

హనుమకొండ,(విజయక్రాంతి): చారిత్రక ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానం(Sri Bhadrakali Temple)లో శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవములు ఈనెల 11 వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈఓ రామల సునీత(EO Ramala Sunitha) తెలిపారు. గురువారం భద్రకాళి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఓ రామల సునీత మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల(Devi Sharannavaratri Celebrations)కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు భక్తులకు క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, ప్రసాదములు ఏర్పాట్లు  చేస్తున్ననట్లు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశం లో  ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, నాగరాజు శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు