అర్హత కలిగిన వారు ఓటరుగా నమోదు చేయించుకునేలా పార్టీలు సహకరించాలి

09-10-2026 | 12:50am

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు తమ పరిధిలో అవగాహన కల్పించాలని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి(Ghatkesar Deputy Commissioner Vanireddy) తెలిపారు. ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ వాణిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశం గురువారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు(graduate voter registration)పై రాజకీయ పార్టీలు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

ఓటరు నమోదుకు అవసరమైన అర్హతలు, దరఖాస్తు విధానం అవసరమై ధ్రువపత్రాలు, గడువులోగా దరఖాస్తుల సమర్పణ తదితర అంశాలపై సమావేశంలో వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు సహకరించాలని వాణిరెడ్డి కోరారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల ద్వారా పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి అర్హులైన వారందరూ ఓటు హక్కును పొందేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అయా శాఖల అధికారులు, అయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు