బిజెపి ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

09-10-2026 | 12:43am

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఏఐసీసీ, పీసీసీ, మండలం అధ్యక్షులు మానుక సత్యం ఆదేశాల మేరకు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ, ఈసీ జ్ఞానేశకుమార్(EC Gyanesh Kumar)ల దొరిని కండిస్తూ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఎన్నికల ముఖ్య అధికారి బిజెపి పార్టీకి అనుకూలంగా పని చేస్తూ, ప్రతిపక్ష పార్టీల ఉనికిని చేరిపి వేసే ప్రయత్నం చేస్తున్నాడని రాజ్యాంగ బద్దగా పని చేసే ఎన్నికల కమిషన్(Election Commissioner) ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్న ఎన్నికల ముఖ్య అధికారి జ్ఞానేషు కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ముదాం ప్రదీప్  కోనరావుపేట సర్పంచ్ మస్కూరి కాశీరం,ఎగ్లాస్ పూర్ సర్పంచ్ పసుల పోచయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు ఎండీ అజీమ్ ఫాష, వెంగళి వెంకటేశ్వర్లు, సింగల్ విండో డైరెక్టర్ ముదం సత్యం,యూత్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు బండి ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట ,నాయకులు ,జింక కరుణాకర్, దుర్ల నారాయణ ప్రకాష్ లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు