అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి

21-09-2026 | 08:52pm

ప్రజావాణిలో వార్డు సభ్యుల వినతి

చిన్నచింతకుంట: మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, డీటీసీపీ (DTCP) అనుమతులు లేకుండా వెలుస్తున్న అక్రమ వెంచర్ల(Illegal ventures)పై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు ఎస్. శేఖర్, ఎండీ గౌస్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి(prajavani) కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలకు వారు లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామ పరిధిలో కొందరు రియల్టర్లు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వ్యవసాయ భూముల(Agricultural lands)ను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి రావాల్సిన 10 శాతం స్థలాన్ని వెంచర్ల యజమానుల నుంచి స్వాధీనం చేసుకొని, పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని అధికారులను కోరారు. అనుమతులు లేని వెంచర్లను నిలిపివేయడంతో పాటు, ప్రజలు మోసపోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు