ప్రజావాణి అర్జీల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి

02-11-2026 | 08:51pm

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, నవంబర్ 02 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(Hanamkonda District Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని  కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి  ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని త్వరగా పరిష్కరించాలన్నారు.ప్రజావాణి అనేది ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, దీనిపట్ల ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించరాదన్నారు.

ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఆయా శాఖలకు సంబంధించిన ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో ఉండకుండా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డి ఆర్ డి ఓ మేన శ్రీను, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు