కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

02-11-2026 | 08:48pm

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి బాల పీర్

కొల్లాపూర్ నవంబర్ 2; నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers' Union) ఆధ్వర్యంలో కొల్లాపూర్ పెంట్లవెల్లి మండలాలను. కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం ప్రజావాణిలో ధర్నా చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers' Union) జిల్లా ఉపాధ్యక్షులు బి బాల పీర్ మాట్లాడుతూ.

రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం  మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి రైతన్నకి ప్రజలకి అందుబాటులోకి నిత్యావసర సరుకుల్ని తీసుకురావాలనే వారన్నారు. రేషన్ షాప్ ద్వారా 14 రకాల నిత్యవసర సరుకుల్ని  పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వారన్నారు. రైతులకు రుణాలను రీ షెడ్యూల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీరుకు తాగునీరుకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను విమర్శించడం మానుకొని ప్రజా సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలని ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రైతు సంఘం కొల్లాపూర్ మండల అధ్యక్షుడు మీసాల శ్రీనివాస్, ఆవాజ్ జిల్లా కన్వీనర్ సలీం, రైతు సంఘం నాయకులు బి  రాముడు, చంద్రుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు