బిసిల మద్దత్తు కోరిన జనసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
హనుమకొండ, అక్టోబర్ 23( విజయ క్రాంతి): జనసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గాడాల శ్రీనివాసరావు బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ను కలసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.హనుమకొండ బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో జనసేన పార్టీ నుండి ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న డా. గడల శ్రీనివాస్ రావు బిసి సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ని కలసి మాట్లాడుతూ ప్రధాన పార్టీ లు అన్ని అగ్రవర్ణాలకు టికెట్ లు కేటాయిస్తున్నాయి అని, జనాభాలో సగానికి పైగా ఉన్న బిసి ల పట్ల అన్ని రాజకీయ పార్టీ లు చిన్న చూపు చూస్తున్నాయని,
ఒక బిసి బిడ్డగా తనకు మద్దతు పలికి గెలిపించాలని కోరారు. అనంతరం వడ్లకోండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లా బిసి సంక్షేమ సంఘం నిర్ణయం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కరాటే ప్రభాకర్ గౌడ్, మాధం పద్మజ దేవి, రాము యాదవ్, పృథ్వి, రామకృష్ణ, అక్షయ్, బిసి సంక్షేమ సంఘం నాయకులు గడ్డం రాజు, సాంబశివుడు, నరేష్ యాదవ్, సతీష్ గౌడ్, సమ్మయ్య, సుమన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.