శ్రీ శారదా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

18-10-2026 | 04:46pm

హనుమకొండ, అక్టోబర్ 18(విజయక్రాంతి): శ్రీ శృంగేరి శారదాపీఠం(Sri Sringeri Sharada Peetham)లో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి(Dasara Sharannavaratri) ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం దుర్గాష్టమి(Durgashtami) సందర్భంగా లలితా త్రిపుర సుందరి అలంకారంలో కొలువుదీరిన శ్రీ శారదా అమ్మవారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy), శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య(Basavaraju Sarayya) తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు,భక్తులు, కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు