బతుకమ్మ చీరల పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 18 (విజయ క్రాంతి): మండలంలోని మాసానీపల్లి గ్రామంలో(Masanipalli Village) సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ బిఆర్ఎస్ నాయకులు(BRS leaders) చేశారు.ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్(Nallamadugu Surender) ఆదేశంసారం సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) సందర్భంగా బతుకమ్మ ఆడిన ఆడపడుచులలో ముగ్గురుని ఎంపిక చేసి బతుకమ్మలు చీరలు పంపిణీ చేసినట్లు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొల్లారం రాజు(Bollaram Raju) తెలిపారు.
మొదటి బహుమతిగా బెస్త పద్మ, రెండవ బహుమతి వరిగే లక్ష్మి,మూడవ బహుమతి పెద్దపట్లోళ్ల సవిత అందజేసినట్లు మాసానిపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం రాజు తెలిపారు.ఈ సందర్భంగా బహుమతులు అందుకున్న ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొల్లారం రాజు మాట్లాడుతూ...కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల చెందిన ప్రతి ఆడపరచులకు బతుకమ్మ చీరలు వచ్చేయని తెలిపారు.
కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు రాకపోవడం చాలా బాధాకరమని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే బతుకమ్మ చీరలు మరెన్నో సంక్షేమ పథకాలు నోచుకోలేకపోతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం రాజు,బిఆర్ఎస్ నాయకులు సందీప్ గౌడ్, గంగయ్య,మోహన్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.