కన్నీళ్లు తెప్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

18-10-2026 | 02:03pm

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.

రాజాపూర్ అక్టోబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి(Ex-Minister Laxmareddy) అన్నారు. ఆదివారం మండలంలోని యారోన్పల్లి గ్రామంలో ఎండిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపుతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టారని తెలిపారు.రైతాంగాన్ని వ్యక్తులకు ఎటువంటి కష్టం లేకుండా నిరంతరాయం వ్యవసాయానికి కరెంటు అందించాలని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనంతో వర్షాకాలం వచ్చిన నీటి ని సముద్రంలోకి వదిన ఘనత వారికి చెందుతుందని అన్నారు.

సమృద్ధిగా నీతి వనరులు ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకోలేదని విమర్శించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడా చూసిన ఎండిపోయిన పంటలే కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతులు వెనుకటి రోజులు గుర్తు చేసుకుంటున్నారని దుయ్యాబడ్డారు.ఈకార్యక్రమలో డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్,గణేష్,లింగం రమేష్ నాయక్,బచ్చిరెడ్డి,యాదగిరి,సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు