ఘనంగా బాల్క సుమన్ జన్మదిన వేడుకలు
రోగులకు పండ్లు పంపిణీ చేసిన బి.ఆర్.ఎస్ నేతలు
సుల్తానాబాద్ , అక్టోబర్ 18 (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) ఆధ్వర్యంలో మాజీ ఎంపీ , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) జన్మదిన వేడుకలను మాజీ ఎంపీటీసీ సూర శ్యామ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో(Government Hospital) రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ(Distribution of fruits and bread) చేశారు.
ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ ఉద్యమ నేత యువ కిశోరం మాజీ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ రానున్న రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ రానున్న రోజుల్లో తిరిగి అధికారం చేపట్టి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు, రాష్ట్రంలో తన సేవలను కొనసాగించాలని తిరిగి బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కెసిఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటుందని యువ నేత కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రజలందరూ తిరిగి బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, కన్వీనర్ బోయిని రాజ మల్లయ్య, నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, తిప్పారపు దయాకర్, గుడిపాటి శ్రీనివాసరెడ్డి, గందె మల్లికార్జున్, అనుమాల బాపూరావు, సతీష్, వహీద్, మహేష్, మోయిజ్, సమీర్, కార్తీక్, మనీ లతోపాటు పలువురు పాల్గొన్నారు.