మున్సిపల్ కార్మికులతో ఘనంగా దసరా అలాయ్‌–బలాయ్‌

18-10-2026 | 05:43pm

చిట్యాల, అక్టోబర్ 18(విజయక్రాంతి ): తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్(Kunuru Sanjay Das Goud) ఆధ్వర్యంలో చిట్యాలలో మున్సిపల్ కార్మికులతో(Municipal workers) దసరా అలాయ్‌–బలాయ్‌ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. వరుసగా మూడో ఏడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో 45 మంది మున్సిపల్ కార్మికులను(Municipal workers) శాలువాలతో సన్మానించి, కొత్త బట్టల కోసం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.22,500 అందజేశారు.

ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల పండుగలు సంతోషంగా జరగడంలో పారిశుధ్య కార్మికుల కృషి ఎంతో ఉందని, వారి సేవలను గుర్తించి గౌరవించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. సంఘం తరఫున ప్రతి మున్సిపల్ కార్మికునికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు