ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
18-10-2026 | 05:40pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతికి(Telangana Culture) అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు ఆదివారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) సందర్భంగా మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో(devotional) బతుకమ్మలను తీర్చారు.బతుకమ్మ వేడుకలతో ఆయా గ్రామాల్లోని చెరువులు, పాఠశాల మైదానాలు(School grounds) వెలుగులతో నిండిపోయాయి. వందలాదిమంది మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... అంటూ ఆడి పాడారు.