వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు

18-10-2026 | 05:29pm

- గ్రామ గ్రామాన బతుకమ్మ పండుగ సంబరాలు..

- పోటాపోటీగా బతుకమ్మల అలంకరణ..

తాడ్వాయి,అక్టోబర్, 18( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు(Saddula Bathukamma Festival) ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూవులతో బతుకమ్మలను పేర్చారు.రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అలంకరించారు. మండలంలోని ఎర్రపహాడు, నందివాడ, తాడువాయి, దేమి కలాన్,కన్కల్, చిట్యాల, కృష్ణాజివాడి,బ్రహ్మాజీ వాడి,బ్రాహ్మణపల్లి  గ్రామాల్లో పోటాపోటీగా బతుకమ్మలను అలంకరించారు.

ఎంతో భక్తిశ్రద్ధలతో(devotional) బతుకమ్మలను పేర్చి గ్రామాల్లోని కూడలిలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు.అనంతరం బతకమ్మలను తీసుకొని వెళ్లి గ్రామ సమీప చెరువులలో, కుంటల్లో నిమజ్జనం చేశారు.అనంతరం అక్కడే తమ వెంట తీసుకువెళ్లిన సద్దులను సహా పంక్తి భోజనాలుగా స్వీకరించారు.

ఎర్ర పహాడ్ గ్రామంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సతీమణి మంజుల రెడ్డి ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చి గ్రామ కూడలిలో ఉంచి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు