రాక్ టౌన్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి

11-09-2026 | 10:14pm

జోనల్ కమిషనర్‌ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు

నాగోల్,(విజయక్రాంతి): నాగోల్ రాక్ టౌన్ కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, కాలనీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రాక్ టౌన్ అసోసియేషన్(Rock Town Association) అధ్యక్షుడు ఎర్ర వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ ప్రతినిధులు జోనల్ కమిషనర్ వికాస్ మహతో(Zonal Commissioner Vikas Mahato)ను కోరారు. శుక్రవారం జోనల్ కమిషనర్‌ను కలిసి కాలనీలోని పలు అభివృద్ధి అంశాలు, పరిష్కరించాల్సిన సమస్యలను వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర వినోద్ రెడ్డి, కార్యదర్శి జైపాల్ రెడ్డి, సలహాదారు సంపత్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు