6 September, 2026 | 12:58 AM

ఆరు వారాల గడువు ఇవ్వండి

06-09-2026 | 12:05am

ఎథిక్స్ కమిటీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తనపై వచ్చిన ఆరోపణల(allegations)పై వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల గడువు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ(Assembly Ethics Committee)ని కోరారు. సెప్టెంబర్ 5లోగా సమాధానం ఇ వ్వాలని ఎథిక్స్ కమిటీ(Ethics Committee) ఆదేశించిన నేపథ్యంలో శనివారం ఎథిక్స్ కమిటీకి ఆయన లేఖ(letter) రాశారు. ఆగస్టు 31న ఎథిక్స్ కమిటీ నోటీసు తనకు అందిందని లేఖలో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) ప్రారంభం కానున్నందున పూర్తి వివరాలను పరిశీలించి సమగ్రంగా స్పందించేందుకు మరింత సమయం అవసరమని తెలిపారు. ఎథిక్స్ కమిటీ తనకు అందించిన మెటీరియల్ పరిమాణం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అందు లోని అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తన వివరణను సమగ్రంగా అందించగలనని తెలిపారు.

మార్చి 29న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్(Video clip) కూడా పూర్తిగా లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన ఒక భాగం మాత్రమే కాకుండా, ఆ రోజు అసెంబ్లీలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి వీడి యోను అందించాలని కోరారు. పూర్తి వీడియోను పరిశీలించిన తర్వాతే ఘటనపై తన వైఖరిని వివరంగా తెలియజేస్తానని కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశా రు. 

మరిన్ని వార్తలు