నా క్యాంపస్ నా బాధ్యత

24-09-2026 | 07:30pm

ఒక విద్యార్థి ఒక మొక్క

కూకట్ పల్లి, సెప్టెంబర్ 24,(విజయక్రాంతి ): జేఎన్టీయూహెచ్(JNTUH) పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో (University College of Engineering, Science and Technology)ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా క్యాంపస్ నా బాధ్యత పేరుతో ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.మొక్కను నాటండి పచ్చని భవిష్యత్తును నిర్మించండి అనే పోస్టర్ ను రిజిస్టర్ జయలక్షి ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం జయలక్ష్మి క్యాంపస్ లో తొలి మొక్కను నాటరు.ఈ సందర్భంగా ఒక విద్యార్థి ఒక మొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేసి, వాటిని క్యాంపస్ లో నాటి తమ విద్యాభ్యాసము పూర్తయ్యే వరకు సంరక్షించే బాధ్యతను అప్పగించారు. మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమం కాకుండా వాటి పెరుగుదల, సంరక్షణను నిరంతరం పర్యవేక్షించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ, సేవాభావము, సామాజిక బాధ్యత పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఏ. రఘురాం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ ఆఫీసర్ రంజిత్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు