విద్యుత్ శాఖ అప్రమత్తత

24-09-2026 | 08:07pm

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర వాతావరణ శాఖ నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ శాఖ(Electricity Department) ఉద్యోగులను అప్రమత్త చేసినట్టు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ రమేష్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశమునందున జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు ఉప కేంద్రాలు చెడిపోకుండా సాంకేతిక సాయంతో ఎక్కడికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలని నిధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు