అనురాగ్ లో ఎంబీఏ, ఎంబీఏ-బిఎ విద్యార్థుల ఓరియంటేషన్

22-09-2026 | 07:29pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్(Anurag University School of Management) ఆధ్వర్యంలో 2026–28 బ్యాచ్‌కు చెందిన ఎంబీఏ, ఎంబీఏ-బిఏ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈరెండు కోర్సుల్లో మొత్తం 150 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు యూనివర్సిటీకి స్వాగతం పలికారు. స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ హెచ్‌ఓడీ డాక్టర్ వి. విష్ణువందన విద్యార్థులకు అకడమిక్ నిబంధనలు, క్రమశిక్షణ, యూనివర్సిటీ నియమావళి గురించి వివరించారు.

ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ కెరీర్, ప్లేస్‌మెంట్ అవకాశాలను వివరించి, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్ విద్యార్థులను అభినందిస్తూ, యూనివర్సిటీలో అందిస్తున్న ప్రాక్టికల్ లెర్నింగ్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను వివరించారు. స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డాక్టర్ బాలాజీ ఉట్ల విద్యార్థులు ఆసక్తితో ప్రశ్నలు అడుగుతూ నేర్చుకోవాలని, క్యారెక్టర్, కంపాషన్, కాంపిటెన్సీలను పెంపొందించుకోవాలని సూచించారు. వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్చనా మంత్రి విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని, వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు