వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

13-10-2026 | 07:34pm

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం

మల్యాల, అక్టోబర్ 13,(విజయ క్రాంతి ): మల్యాల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో(Kondagattu Sri Anjaneya Swamy Devasthanam) దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మూలమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చన చేసి, భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు.

మరిన్ని వార్తలు