లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
కొడిమ్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో భారత దేశ మాజీ రెండవ ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి(Lal Bahadur Shastri Jayanti) వేడుకలు ప్రజా సంఘాల రాష్ట్ర కార్యదర్శి కొత్తూరి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించడం జరిగింది.
కొత్తూరి స్వామి మాట్లాడుతూ... లాల్ బహుదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఒక పేద కుటుంబంలో జన్మించి చదువు కోసం నది దాటి వెళ్లాలంటే పడవకు రెండు పైసలు చెల్లించే స్తోమత లేక పుస్తకాలు నెత్తిన పెట్టుకొని నది ఈదుకుంటూ పోయి చదువుకునేవారు గాంధీజీ స్వాతంత్ర పోరాటంలో ప్రేరణ పొంది ఆయనతో అనేక స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించినారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.