చికిత్స పొందుతూ యువకుడు మృతి

27-10-2026 | 10:17pm

కొడిమ్యాల అక్టోబర్ 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagityal District) కొడిమ్యాల మండలం శనివారం పేట గ్రామానికి చెందిన గుడిసె సుశాంత్,గుడిసె ఉదయ్ ఈనెల 19 తేదీన భీమారం వెళ్లి తిరిగి శనివారం పేటకు వస్తున్న క్రమంలో సూరంపేట శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కన గల చెట్టుకు ఢీకొనగా సుశాంత్, ఉదయ్ లకు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం ఉదయ్ చికిత్స పొందుతూ, సుశాంత్ మరణించడం జరిగింది. ఇట్టి విషయమై మృతుని అన్న గుడిసె రణధీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కొడిమ్యాల ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు