అన్ని దానాలలో అన్నదానం గొప్పది
22-09-2026 | 06:22pm
జనగామ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): అన్ని దానాలలో అన్నదానం గొప్పదని భావిస్తూ గణేశ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navaratri Celebrations)ను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రఘునాథపల్లి మండల కేంద్రంలోని గిర్నిగడ్డ సమీపంలో బీఆర్ఎస్ జిల్లా యువనేత దుబ్బాక హరీష్ గౌడ్, నీరజ దంపతులు, దుబ్బాక కుటుంబ సభ్యులు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారి ఇంటి సమీపంలో భక్తులు, గ్రామస్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుబ్బాక హరీష్ గౌడ్ దంపతులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.