రక్తదానం చేస్తూ పుట్టినరోజు వేడుక

09-10-2026 | 04:13pm

మానవత్వం చాటిన మల్కాపూర్ యువకుడు

29వ సారి రక్తదానం చేసిన రంజిత్ రెడ్డి

జనగామ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జనగామ జిల్లా (Jangaon District) చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ రెడ్డి(Ranjith Reddy) తన జన్మదినాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. శుక్రవారం తన పుట్టినరోజు(Birthday) సందర్భంగా హనుమకొండలోని  రెడ్ క్రాస్ సొసైటీలో(Red Cross Society) రక్తదానం(Blood Donation) చేశారు. ఇది ఆయన చేస్తున్న 29వ సారి రక్తదానం కావడం విశేషం పుట్టినరోజు అంటే కేకులు, పార్టీలు కాదని, నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని రంజిత్ రెడ్డి అన్నారు. యువత కూడా రక్తదానంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు