మణుగూరులో ఎక్సైజ్ దాడులు
28 కేసులు నమోదు!
22 మంది అరెస్ట్..
98 లీటర్ల నాటుసారా స్వాధీనం
మణుగూరు, అక్టోబర్ 9(విజయక్రాంతి ): మణుగూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్(Manuguru Prohibition and Excise Station) పరిధిలో అక్రమ మద్యం(Illicit liquor), నాటుసారా తయారీ(Production of illicit arrack), విక్రయాలపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు చేపట్టిన దాడుల్లో మొత్తం 28 కేసులు నమోదు(Cases registered) చేసి, 22 మందిని అరెస్టు చేశారు.ఈ దాడుల్లో 98 లీటర్ల నాటుసారాతో పాటు 40.31 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.నాటుసారా తయారీకి ఉపయోగించే 1,980 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
నాటుసారా రవాణాకు ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై 13 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక బ్రీచ్ కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు(Excise Inspector K. Nageswara Rao) తెలిపారు.
నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు నాటుసారా తయారీ లేదా విక్రయాల సమాచారం తెలిస్తే ఎక్సైజ్ సీఐ 8712658855, ఎస్‌ఐ విజయ్ భాస్కర్ 9398689688 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.