ఘనంగా రతన్ టాటా వర్ధంతి
ముకరంపుర, అక్టోబర్ 9(విజయక్రాంతి): పారిశ్రామికవేత్త, మానవతా వాది రతన్ టాటా(Industrialist and philanthropist Ratan Tata) వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం కరీంనగర్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్(Karimnagar Tata Life Insurance) కార్యాలయం నందు బ్రాంచ్ మేనేజర్లు ఆదర్శ్ కుమార్,వీరస్వామి మరియు కార్యాలయ సిబ్బంది బ్రాంచ్ ట్రైనర్ వెంకటేశ్ వర్మ ,బామ్స్ నవీన్ కుమార్, శ్రీకాంత్, మహేందర్, చంద్రశేఖర్ లతో కలిసి రతన్ టాటా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్లు ఇరువురు మాట్లాడుతూ రతన్ టాటా ఆశయాలు విలువలు సేవా స్పూర్తి ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు కరోనా సమయంలో దేశానికి చేసిన సహాయ సహకారాలు మరువ లేని వని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లీడర్లు అడ్వైజర్లు, టెలికాలర్స్ తదితరులు పాల్గొన్నారు.