ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు: జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి

27-09-2026 | 07:36pm

జనగామ, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సోమవారం రోజున జనగామలో భారీ ఆందోళన చేపడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి(District Congress President Lakavath Dhanvanthi) తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు నెహ్రూ పార్కు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రం ఇస్తామని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే తప్పుకోవాలి ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలి జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పుల వివరాలను బయటపెట్టాలి ఓటర్ల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలి రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల ముందుకు తెచ్చి పోరాడుతున్నారని, దీనికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని వైటీడీఏ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని, నియోజకవర్గ బాధ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మారుజోడు రాంబాబు, నాయకులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, లోకుంట్ల ప్రవీణ్, బోనాసి క్రాంతి, జాయ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు