హీరో బ్రహ్మాజీకి త్రైత సిద్ధాంత భగవద్గీత అందజేత
జనగామ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో సినిమా షూటింగ్ కు వచ్చిన ప్రముఖ సినీ నటుడు హీరో బ్రహ్మాజీకి(Film actor and hero Brahmaji) ప్రబోధ సేవా సమితి జనగామ కమిటీ ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని అందజేశారు. త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో కమిటీ సభ్యులు కొన్నే ఉపేందర్, కొన్నే అమృత శ్రీ ఈ గ్రంథాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ సినీ జీవితంలో ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల మనోధైర్యం పెరుగుతుందని అన్నారు. అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వందకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారని, భగవద్గీత సారాన్ని త్రైత సిద్ధాంతం ద్వారా సులభంగా అర్థమయ్యేలా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆముదాల భూపాల్ రెడ్డి, మహేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.