భద్రాద్రి జిల్లా నుండి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మెచ్చు రాణి
ఉత్తమ ఉపాధ్యాయురాలికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్ యేజారె
దమ్మపేట (విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు మెచ్చు రాణి(Mechu Rani) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 'జీ తెలుగు' ఆధ్వర్యంలో నిర్వహించిన "గురు వందనం-2026" విద్యా సదస్సు, ఉపాధ్యాయ పురస్కారాలు కార్యక్రంలో ఆమె ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు.
ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కె కేశవరావు, తెలంగాణ ప్రభుత్వం ముఖ్య సలహాదారులు, ఎంపి ఈటల రాజేంద్ర, ఎం ఎల్ ఏ హరీష్ రావు లు ముఖ్య అతిథిలుగా హాజరుకాగా, మంత్రులు, ప్రముఖులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది అవార్డు అందుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. మెచ్చు రాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.