జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించిన అగ్రజ్

13-10-2026 | 06:59pm

అభినందించిన ప్రిన్సిపాల్ సిజ్జు ఎస్ నాయర్ 

సుల్తానాబాద్ (విజయక్రాంతి): గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఎస్ జి ఫ్ స్విమ్మింగ్ పోటీలు మంగళవారం నిర్వహించారు. ఇందులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన కేరళ మోడల్ హై స్కూల్(Kerala Model High School) విద్యార్థి అండర్ 14 విభాగంలో డి. అగ్రజ్ 6వ తరగతి విద్యార్థి స్విమ్మింగ్ లో 50 మీటర్ల విభాగంలో బ్యాక్ స్ట్రోక్ లో బంగారు పతకం సాధించారని, వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా అగ్రజును కేరళ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సిజ్జు ఎస్ నాయర్ వైస్ ప్రిన్సిపాల్ స్మిత ఎస్ నాయర్, పిటీలు ఎ. అజయ్, డీ. రాజు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు