దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- కేటీకే–8 ఇంక్లైన్ మైన్లో నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు
గణపురం, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): గణపురం మండలంలోని కేటీకే–8 ఇంక్లైన్ మైన్లోని దుర్గామాత ఆలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పాల్గొని సింగరేణి కార్మికులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
నవరాత్రి ఉత్సవాలతో ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సింగరేణి కార్మికులు, ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘ నాయకులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, బుర్ర కొమురయ్య గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.