ఆప్టోమా ఇండియా 4K హోమ్ సినిమా, ప్రొఫెషనల్ డిస్‌ప్లే విడుదల

16-10-2026 | 09:10pm

హైదరాబాద్: ప్రొజెక్షన్, డిస్‌ప్లే టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన ఆప్టోమా ఇండియా(Optoma India), గృహ వినోదం, ప్రీమియం హోమ్ సినిమా , ప్రొఫెషనల్ డిస్‌ప్లే పరిష్కారాలలో తమ సరికొత్త ఆవిష్కరణలను చేస్తూ హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక మీడియా ప్రదర్శనను నిర్వహించింది. బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూలో జరిగిన ఈ ప్రదర్శన, మీడియా ప్రతినిధులకు ఆప్టోమా యొక్క సరికొత్త ఉత్పత్తులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. అభివృద్ధి చెందుతున్న విజువల్‌ టెక్నాలజీలు గృహ వినోదం, వృత్తిపరమైన వాతావరణాలను ఏ విధంగా మారుస్తున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కూడా ఈ ప్రదర్శన అందించింది.

హైదరాబాద్‌లో విస్తరిస్తున్న సాంకేతిక రంగం, పెరుగుతున్న కార్పొరేట్‌ కార్యకలాపాలు, అభివృద్ధి చెందుతున్న ప్రీమియం గృహ నిర్మాణ రంగం కారణంగా ఈ ప్రదర్శనకు, ఈ నగరం ఆప్టోమాకు ఒక వ్యూహాత్మక మార్కెట్‌గా మారింది. నగర గృహ విపణిలో అధిక విలువ కలిగిన గృహాలకు గణనీయమైన రీతిలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్య రంగాలలో ఉన్నతమైన జీవన ప్రమాణాలకు  పెరుగుతున్న ప్రాధాన్యత, అలాగే అధునాతన ప్రజెంటేషన్, డిజిటల్ డిస్‌ప్లే పరిష్కారాలకు  ఉన్న డిమాండ్, ఆప్టోమా యొక్క ఉత్పత్తుల విస్తరణకు  హైదరాబాద్‌ను ఒక ముఖ్యమైన మార్కెట్‌గా నిలుపుతున్నాయి.

ఆప్టోమా ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్, విజయ్ శర్మ మాట్లాడుతూ" ప్రీమియం హోమ్ సినిమా, అధునాతన ప్రొఫెషనల్ డిస్‌ప్లే పరిష్కారాల కోసం డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆప్టోమాకు హైదరాబాద్ ఒక ముఖ్యమైన మార్కెట్ గా నిలిచింది.

ట్రిపుల్ లేజర్ RGB టెక్నాలజీతో కూడిన మా ప్రతిష్టాత్మక UHR90DV 4K UHD ప్రొజెక్టర్‌తో పాటు, మా ఆప్టోమా ఫోటాన్ బీమ్ PK52 మరియు స్టూడియో సిరీస్ ప్రొఫెషనల్ డిస్‌ప్లేల ద్వారా నివాస, వాణిజ్య విభాగాలలో మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, లీనమయ్యే దృశ్య అనుభవాలను, అధిక పనితీరు గల డిస్‌ప్లే పరిష్కారాలను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రదర్శనలో ఆప్టోమా ఉత్పత్తి శ్రేణికి చెందిన మూడు కీలక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇంట్లో లీనమయ్యే సినిమా అనుభవాన్ని అందించే ప్రొజెక్టర్ల నుంచి వాణిజ్య అవసరాల కోసం నిరంతరం పనిచేసే డిస్‌ప్లేల వరకు,  విభిన్న అవసరాలకు అనుగుణంగా తమ సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయో సంస్థ ప్రదర్శించింది. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ప్రదర్శన ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను వివిధ రకాలుగా ఉపయోగించుకునే అవకాశాలను వివరించాలని  ఆప్టోమా లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న వినియోగదారుల అంచనాలు, లీనమయ్యే గృహ వినోదానికి పెరుగుతున్న ప్రాధాన్యత, ప్రొఫెషనల్ విభాగాలలో  ఆధారపడతగిన, నాణ్యమైన దృశ్య సమాచారానికి ఉన్న అవసరం వంటి అంశాలపై మీడియాతో చర్చించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది.

మెరుగైన పనితీరు, సౌలభ్యం, సులభమైన వినియోగాన్ని అందించే డిస్‌ప్లే పరిష్కారాల కోసం  వ్యాపార సంస్థలు, వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారతదేశంలో మారుతున్న గృహ వినోదం, ప్రొఫెషనల్‌ డిస్‌ప్లే మార్కెట్ల అవసరాలను తీర్చే సాంకేతిక పరిష్కారాలను అందించడంపై ఆప్టోమా దృష్టి సారిస్తూనే ఉంది.

మరిన్ని వార్తలు