ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించిన

16-10-2026 | 08:52pm

 మండల ప్రత్యేక అధికారి 

నాగిరెడ్డిపేట్ అక్టోబర్ 16 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో(Malthummeda Village) కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) నిర్మాణం పనులను మండల ప్రత్యేక అధికారి రాజ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పనుల నిర్మాణం వేగవంతం పెంచాలని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.అలాగే పోచారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని(Pocharam Gram Panchayat Office) సందర్శించి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులకుపై పాలకవర్గంతో చర్చించారు.

పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తిచేయాలని నాణ్యతతో చేపట్టాలని లబ్ధిదారులకు త్వరగా అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం ఉండకూడదని నాణ్యమైన పనులు చేపట్టాలన్నారు.పోచారం గ్రామంలో చేపట్టబోయే నూతన మరిన్ని అభివృద్ధి పనులపై చర్చించారు.పోచారం ప్రాజెక్టును సందర్శించి పోచారం ప్రాజెక్టు చరిత్రను నీటి సామర్థ్యం విస్తీర్ణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోచారం,మాల్తుమ్మెద గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరయ్యాయి ఎన్ని పూర్తయ్యాయనీ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,పోచారం, మాల్తుమ్మెద,గ్రామ సర్పంచులు సంజీవరావు, పుప్పాల సాయిలు,పంచాయతీ కార్యదర్శులు అశోక్,అశోక్ కుమార్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు