జహీరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు.. హ్యుందాయ్ మెగా ప్లాన్!

16-10-2026 | 04:51pm

తెలంగాణకు హ్యుందాయ్ భారీ పెట్టుబడులు.. 4,276 ఉద్యోగాలు!

హైదరాబాద్: తెలంగాణలో ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాలకు మరింత ఊతమిచ్చేలా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (Hyundai Motor India Engineering) భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. జహీరాబాద్‌(Zaheerabad)లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి (R&D), వాహన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4,276 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సమావేశమైన హ్యుందాయ్ ప్రతినిధి బృందం ప్రాజెక్టు పురోగతిని వివరించింది. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలమని సీఎం పేర్కొంటూ, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 678 ఎకరాల్లో దశలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ కేంద్రం వాహనాల పరీక్షలు, పనితీరు ధ్రువీకరణ, ఇంజినీరింగ్ పరిశోధనలకు కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు