చండిక అలంకారంలో మహంకాళి
మూలా నక్షత్రం సందర్భంగా పుస్తక పూజలు
గజ్వేల్, అక్టోబర్ 16: గజ్వేల్ పట్టణంలోని(Gajwel town) 500 ఏళ్ల చరిత్ర కలిగిన మహాంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri Celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు చండిక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా పుస్తక పూజలు(Worship of Books) నిర్వహించడంతో ఆలయం భక్తులతో(devotees) కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు నంద బాలశర్మ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన పాత ఆలయం స్థానంలో ధర్మకర్తల మండలి, సుమారు 50 మంది శాశ్వత సభ్యులు, స్థానిక భక్తుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో మహాంకాళి అమ్మవారితో పాటు మనసాదేవి, రాజశ్యామలాదేవి, శ్రీ కాలభైరవ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు వివరించారు. ప్రతి ఏటా శరన్నవరాత్రులతో పాటు సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళ్యాణ్కర్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు కప్ప మమత పోచయ్య, నాయిని సత్యలక్ష్మి యాదగిరి, బొగ్గుల సురేష్ స్వప్న, కప్ప భాస్కర్, హనుమండ్ల నాగరాజు నేత, అల్వాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.