కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు?

16-10-2026 | 06:35pm

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని లులు మాల్‌(Kukatpally Lulu Mall)లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్‌(KitKat Chocolate)లో పురుగులు కనిపించాయని ఓ కస్టమర్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆహార భద్రత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ఉత్పత్తిని తనిఖీ చేయాలని కోరారు. చాక్లెట్ నాణ్యత, ప్యాకేజింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫుడ్ సేఫ్టీ(Food Safety) అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్ డిమాండ్ చేశారు. అయితే, చాక్లెట్‌లో నిజంగా పురుగులు ఉన్నాయా, ఉత్పత్తి నాణ్యతలో లోపం ఉందా అనే విషయాలు అధికారిక తనిఖీలతో నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తారా? సంబంధిత ఉత్పత్తిని పరీక్షించి వాస్తవాలను వెల్లడిస్తారా? అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు