రవి నగర్ కళాకారులకు డప్పుల పంపిణీ

18-10-2026 | 04:19pm

గణపురం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గణపురం మండలంలోని రవినగర్ గ్రామానికి చెందిన కళాకారులకు ఆదివారం డప్పులను అందజేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) ఆదేశాలతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో కళాకారులకు పంపిణీ చేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే డప్పు కళను కొనసాగిస్తూ పండుగలు, సామాజిక కార్యక్రమాల్లో కళాకారులు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ సహాయం అందించినట్లు భాస్కర్ రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కళలను ప్రోత్సహించడంతో పాటు కళాకారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డప్పు కళాకారులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  ఆకుల శ్రీనివాస్,  కొడారి బాబు, పెంట రవీందర్, ఉడుత రవీందర్, పలకల విద్యాసాగర్‌రెడ్డి, కుక్కముడి లింగయ్య, వార్డు సభ్యులు చింతిరెడ్డి సమ్మిరెడ్డి, ఉల్లాల రాజు, పేరాల సంపత్‌రావు, జంగా రామ్మూర్తి, గోరంట్ల వెంకన్న, వెంకటరెడ్డి, మరిపెల్లి రాజు డప్పు కళాకారులు జక్కు రాజు, లంకదారి స్వామి, రవి, నాగరాజు, నరసయ్య, స్వామి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు