అశోక ధమ్మచక్ర పరివర్తన దినోత్సవం విజయవంతం చేయాలి

18-10-2026 | 05:50pm

అక్టోబర్ 29న లుంబిని దీక్షాభూమిలో వేడుక 

హాజరుకానున్న రెంజర్ల రాజేష్

ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) కేంద్రంలోని లుంబిని దీక్షాభూమిలో(Dikshabhumi) ఈ నెల 29న నిర్వహించనున్న 70వ అశోక ధమ్మచక్ర పరివర్తన దినోత్సవానికి సంబంధించిన పాంప్లెట్‌ను రాజ్యాంగ రక్షణా దళ్ ఫౌండర్ రెంజర్ల రాజేష్(Renjarla Rajesh) విడుదల చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అక్టోబర్ 29న జరిగే కార్యక్రమానికి ధమ్మ బాంధవులు, బౌద్ధ ఉపాసకులు, అంబేద్కర్‌వాదులు, యువత, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దుర్గం ప్రశాంత్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు