ధన్వాడలో ఆధ్యాత్మిక సందడి..
గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఘన స్వాగతం
భూపాలపల్లి, నవంబర్ 01 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అవధూత దత్త పీఠం మైసూర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ(Sri Ganapathy Sachchidananda Swamyji) ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ధన్వాడ గ్రామానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా స్వామీజీకి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుటుంబ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామీజీ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందడితో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ లు పాల్గొన్నారు.