భూపాలపల్లిలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి
భూపాలపల్లి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగొండ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, మాజీ మంత్రి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాధన, చేనేత రంగ అభ్యున్నతి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, మంజూరు నగర్‌లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, పద్మశాలి సంఘం నాయకులు అడ్డగట్ల శ్రీధర్, తౌటం ప్రభాకర్, గూట్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.