మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారులు..

27-09-2026 | 05:49pm

ఫిబ్రవరి 17 నుండి 20 వరకు మేడారం మినీ జాతర 

ములుగు, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వచ్చే సంవత్సరం జరగనున్న మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka-Saralamma) పూజారులు ఆదివారం ప్రకటించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుండగా మధ్యలో వచ్చే సంవత్సరంలో పూజారులు మినీ జాతర నిర్వహిస్తారు. ఈ క్రమంలో మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సైతం లక్షల సంఖ్యలో భక్తులు మేడారంకు తరలివస్తారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 నుండి 20 తేది వరకు నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతరను నిర్వహించనున్నట్టు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధమైన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు పూజారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు