యువ సేన యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

27-09-2026 | 05:22pm

నంగునూరు, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నంగునూరు మండలం(Nangunur Mandal) గట్లమల్యాల యువ సేన యూత్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో యువసేన యూత్ అధ్యక్షుడిగా(Yuva Sena Youth President) కర్రే సంపత్, ఉపాధ్యక్షుడిగా రంగు ప్రమోద్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గజ్వేల్లి రాజ్ కుమార్(Gajvelli Raj Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా రంగు ప్రవీణ్, ముడికే అజయ్, కె. హరీష్, బసాని యాదగిరిలను నియమించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలో యువతను ఐక్యంగా ఉంచుతూ,సామాజిక,సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రతినిధులందరినీ ఘనంగా సత్కరించి,సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు